ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్.. అక్కడ మాత్రం రద్దు!

ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్.. అక్కడ మాత్రం రద్దు!
x
Highlights

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది....

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 65 శాతం వరకు పోలింగ్ జరిగింది. కర్నాటకలో 63 శాతం వరకు, పశ్చిమబెంగాల్‌లో 70 శాతం దాకా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక బీహార్‌లో 65 శాతం వరకు, అసోంలో 70 శాతం దాటినట్లు సమాచారం. అటు ఛత్తీస్‌ఘడ్‌లో దాదాపు 65 శాతం, తమిళనాడులో 63 శాతం, మహారాష్ట్రలో 64 శాతం, మణిపూర్‌లో 75 శాతం, జమ్మూకాశ్మీర్‌లో 55 శాతం దాకా పోలింగ్ నమోదైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో రెండోదశ పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. మొత్తం 95 స్థానాలకు ఓటింగ్ జరిగింది.

97 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్నా... త్రిపురలోని త్రిపుర ఈస్ట్‌ స్థానానికి జరగాల్సిన పోలింగ్‌ను ఈ నెల 23కు పోస్ట్ పోన్ చేసింది ఎన్నికల సంఘం. ఇక 39 స్థానాలున్న తమిళనాడులో అన్ని సెగ్మెంట్లకు ఓటింగ్ జరగాల్సి ఉన్నా... వేలూరు ఎన్నికను ఈసీ రద్దు చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేయడానికి సామాన్య ఓటర్లలాగే క్యూలైన్లో నిల్చొని మరీ ఓటు వేశారు. సాయంత్రం ఆరుదాటినా కూడా క్యూలో ఉన్నవారంతా ఓట్లు వేయడానికి ఈసీ అనుమతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories