ముగిసిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్
x
Highlights

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడక్కడ చిన్ని చిన్ని ఘర్షణలు మినహ పోలింగ్‌ ప్రశాతంగా పూర్తైంది.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడక్కడ చిన్ని చిన్ని ఘర్షణలు మినహ పోలింగ్‌ ప్రశాతంగా పూర్తైంది. ఇప్పటి వరకు సుమారు 46.78 శాతం పోలింగ్‌ నమోదైంది. క్యూలైన్‌లో ఉన్న వారి ఓటు హక్కు వినియోగించుకునే సరికి ఇది మరింత పెరిగే అవకాశముంది. రెండో దశలో కీలక నేతలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 17 జిల్లాల్లో మొత్తం 41వేల 362 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 28న తొలి విడతలో 71 స్థానాలకు 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెమండో విడత పోలింగ్ ఇవాళ జరగగా.... మూడో విడత నవంబరు 7న జరగనుంది. ఈ నెల 10న ఫలితాలు వెల్లడిస్తారు. దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్​లో 28, గుజరాత్​లో 8, ఉత్తర్​ప్రదేశ్​లో 7, ఒడిశా, నాగలాండ్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు స్థానాలకు, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories