Top
logo

రెండో విడత లోక్‌సభ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు

రెండో విడత లోక్‌సభ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు
X
Highlights

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక...

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అలాగే కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌ స్టార్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే ఆయన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. రజనీ పోలింగ్‌ కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడి అధికారులు లేచి నిలబడ్డారు.

Next Story