Budget Session: నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు

Second Phase Budget Parliament Sessions From Today
x

పార్లమెంట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Budget Session: నెల రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాలు * ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ

Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఒకే సారి కాకుండా వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాల్సి ఉంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏప్రిల్ 8వ తేదీ వరకు అంటే సుమారు నెలరోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉండగా ఎన్నికల దృష్ట్యా రెండు వారాలకే కుదించే అవకాశం ఉంది. దాదాపు అన్ని పార్టీలు కూడా దీనికి సుముఖంగా ఉండటంతో.. ఇవాళే దీనిపై ప్రకటన వెలువడవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories