TOP 6 News @ 6PM: అమెరికాలో ఉండే ఇండియన్స్‌కు కొంత ఊరటనిచ్చే గుడ్ న్యూస్

TOP 6 News @ 6PM: అమెరికాలో ఉండే ఇండియన్స్‌కు కొంత ఊరటనిచ్చే గుడ్ న్యూస్
x
Highlights

1) మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు....

1) మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనే నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుంది తప్ప తను ఎవ్వరి పేరును సిఫార్సు చేయడం లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కంటే ప్రజా సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించామని అన్నారు.

2) మాట్లాడుకుందాం రండి... ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందించిన కార్మిక శాఖ

TGSRTC strike latest news: తెలంగాణ ఆర్టీసీ జేఏసి ఇచ్చిన సమ్మె నోటీసులపై కార్మిక శాఖ స్పందించింది. జనవరి 27న టిజీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమ్మె నోటీసులపై కార్మిక శాఖ స్పందిస్తూ అటు ఆర్టీసీ జేఏసికి, ఇటు ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ నెల 10న సోమవారం నాడు చర్చలు జరపనున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

ఆర్టీసీ యాజమాన్యం నుండి ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ కోరుతున్న 21 డిమాండ్స్ పై కార్మిక శాఖ చర్చించనుంది. ఆర్టీసీ ఉద్యోగ జేఏసి ఇచ్చిన గడువు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది. ఆ లోగా ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే ఆ తరువాత తాము సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిస్తూ వస్తోంది. ఈ కారణంగానే ఫిబ్రవరి 10న వారి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు కార్మిక శాఖ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

3) Indians deported from US: గత 15 ఏళ్లలో అమెరికా నుండి ఏ ఏడాది ఎంత మంది డిపోర్ట్ అయ్యారంటే...

Indians deported from US: అమెరికా ఇలా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. అంతేకాకుండా ఇదేమీ కేవలం ఏదో ఒక్క దేశానికే వర్తించే ప్రక్రియ కాదని, అన్ని దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులతో అమెరికా ఇలానే వ్యవహరిస్తోందని చెప్పారు.

2009 నుండి ఇప్పటివరకు గత 15 ఏళ్లలో అమెరికా మొత్తం 15,756 మంది భారతీయులను అక్రమవలసదారులుగా గుర్తించి వెనక్కు పంపించిందన్నారు. భారతీయులను అమెరికా వెనక్కు పంపించిన తీరుపై గురువారం పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో వారికి సమాధానం ఇస్తూ రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) Water bells: ఆ బడిలో వాటర్ బెల్స్ కూడా కొడుతారు

Water bells: ప్రతి స్కూల్లో ఫస్ట్ బెల్ మొదలుకుని లీజర్ బెల్ అనే పదాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ స్కూల్లో మాత్రం వాటర్ బెల్ కూడా వినిపిస్తోంది. ప్రతి రోజు రెండు సార్లు వాటర్ బెల్ మోగుతుంది. ఇదేంది కొత్తగా అనుకుంటున్నారా? విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌ సహా స్టాఫ్ అంతా కలిసి ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Vijayasai Reddy: జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ !

Vijayasai Reddy: జగన్‌కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్నారు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదిలేసుకున్నానంటూ వివరణ ఇచ్చారు.

విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంపై గురువారం స్పందించిన జగన్.. సాయిరెడ్డి కావచ్చు వెళ్లిపోయిన వాళ్లు కావచ్చు, వెళ్లబోయే వాళ్లు కావచ్చు.. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. అయితే దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి తనకు క్యారెక్టర్ ఉందంటూ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం చర్చనీయాంశమైవుతోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో కోర్టు వ్యాఖ్యలు

అమెరికాలో ఉండే భారతీయులకు భారీ ఊరట దక్కినట్లు తెలుస్తోంది. బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు చేస్తూ డోనల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్స్ ను నిరవధికంగా బ్లాక్ చేస్తున్నట్లు సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జి ప్రకటించారు. అంతేకాకుండా డోనల్డ్ ట్రంప్ రాజ్యాంగంతో పాలసీ గేమ్స్ ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మేరీల్యాండ్ ఫెడరల్ జడ్జి కూడా ఇదే తరహాలో ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్స్ ను అడ్డుకుంటూ ట్రంప్ నకు వ్యతిరేక ఆదేశాలు ఇచ్చారు. తాజాగా సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జి కొఫెనర్ కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రూల్ ఆఫ్ లా ను విస్మరిస్తున్నారని కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. ఇది అమెరికాలో ఉండే ఇండియన్స్‌తో పాటు విదేశీయులు అందరికీ కొంత ఊరటనిచ్చే పరిణామం అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories