తెలంగాణలో CWC సమావేశాలకు షెడ్యూల్ విడుదల

Schedule Released for CWC Meetings in Telangana
x

తెలంగాణలో CWC సమావేశాలకు షెడ్యూల్ విడుదల

Highlights

CWC Meetings: ఈనెల 16,17,18న సమావేశాలు

CWC Meetings: తెలంగాణలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు CWC సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16 మధ్యాహ్నం లంచ్ అనంతరం 2 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 17న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు CWC సభ్యులు, పీసీసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం విజయభేరి సభ నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ సభలో కర్ణాటక తరహాలో ఐదు గ్యారంటీ స్కీమ్‌లు ప్రకటించనుంది కాంగ్రెస్. దీంతో పాటు BRS ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 119 నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు పర్యటిస్తారు. పర్యటన అనంతరం రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస చేస్తారు.

ఇక సీడబ్ల్యూసీ సమావేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లను నియమించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, సీఎల్పీ నేత భట్టి సహా మొత్తం 23 మంది నేతలను కో ఆర్డినేటర్లను నియమించింది. రాష్ట్రంలోని 5 నియోజకవర్గాలకు ఒకరి చొప్పున కో ఆర్డినేటర్లు పనిచేయనున్నారు. ఈ నేతలంతా CWC సమావేశాలతో పాటు అనంతరం జరిగే ప్రజాకోర్టు కార్యక్రమాలు, రాబోయే ఎన్నికల్లోపు జరగాల్సిన కార్యక్రమాల బాధ్యతలు కూడా కో ఆర్డినేటర్లు నిర్వర్తించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories