logo
జాతీయం

ఇవాళ అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఇవాళ అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
X
Highlights

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 60 ఏళ్లుగా ఎటూ తేలకుండా సాగుతున్న అయోధ్యలోని రామ...

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 60 ఏళ్లుగా ఎటూ తేలకుండా సాగుతున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు గతంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను నియమించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, లాయర్ శ్రీరామ్‌ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. వీరు వివిధ రకాలుగా చర్చలు జరిపారు. ఈ మధ్యవర్తిత్వ కమిటీ సీల్డ్ కవర్‌లో తమ నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.

దీంతో మధ్యవర్తిత్వం ఫలితంపై ఇవాళ సుప్రీం కోర్టులోనే అయోద్యంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళా ఇది సున్నితమైన కేసు కాబట్టి కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతం చేయలేదు. ఈ నెల 6న సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది మధ్యవర్తిత్వ కమిటీ. దీంతో నాలుగు రోజుల అనంతరం దీనిపై విచారణ జరుగుతోంది. ఇక ఈ కేసుపై ఏమి తేలుతుందో అని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Next Story