కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్
x
Highlights

జడ్జీల ప్రమోషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతులపై కేంద్రం అభ్యంతరాలను సుప్రీంకోర్టు...

జడ్జీల ప్రమోషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతులపై కేంద్రం అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చిం ది. ఈ విషయంలో గత తీర్పునకే తాము కట్టుబడి ఉన్నామని సర్వోన్నత న్యాయ స్థానం తేల్చిచెప్పింది. జడ్జీల సామర్థ్యం, పనితీరు, ప్రవర్తనను ప్రశ్నించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతికి అర్హతే ప్రామాణికమని పేర్కొంది.

జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్దా బోస్, గౌహతీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. ఐతే, సీనియారిటీ, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతా లను కార ణాలుగా పేర్కొంటూ ఆ ఇద్దరి ప్రమోషన్‌ను కేంద్ర న్యాయశాఖ తోసిపు చ్చింది. ఐతే, కేంద్రం అభ్యంతరాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 12 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన సుప్రీం, జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ బోపన్నలకు ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories