SBI Customers: ఎస్బీఐ హెచ్చరిక..! ఇలా చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుంది..

SBI Warns Clients about Cyber Scams
x

ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక(ఫైల్ ఫోటో)

Highlights

* ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మెస్సేజ్‌లు, బ్లూలింక్‌లపై క్లిక్‌ చేయవద్దని SBI హెచ్చరిస్తుంది.

SBI Customers: ఎస్బీఐ తన ఖాతాదారులను హెచ్చరిస్తుంది. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు సైబర్‌ దాడులు పెరిగిపోతున్నాయి. అంతేగాక చాలామంది బాధితులు వారి బారినపడి ఎంతో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఖాతాదారులను అప్రమత్తం చేసింది. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోకూడదని చెబుతోంది.

ఉచిత బహుమతులు లేదా వోచర్‌లు వస్తాయంటే ప్రజలు ఎగిరి గంతేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మెస్సేజ్‌లు, బ్లూలింక్‌లపై క్లిక్‌ చేయవద్దని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇవి సైబర్ నేరస్థుల పని. ఒకవేళ ఆ లింక్‌లు ఓపెన్ చేస్తే క్షణాల్లో మీ ఖాత నుంచి డబ్బులు మాయమవుతాయని తెలిపింది. అందుకే ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.

నిజానికి సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో బ్యాంక్ వివరాలు, ATM, UPI పిన్‌లను షేర్ చేయమని SBI మిమ్మల్ని ఎప్పుడూ అడగదని తెలిపింది. మీకు ATM లేదా UPI పిన్ అడగటం లాంటి మెస్సేజ్‌లు వస్తే వాటిని ఓపెన్‌ చేయవద్దని తెలిపింది.

కొంతమంది సైబర్ దుండగులు SBI పేరుతో కస్టమర్ల వివరాలు అడుగుతున్నారని వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. SBI ఖాతా నంబర్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాల కోసం తన కస్టమర్‌ను అడగదు .మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, OTP నంబర్‌లను ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు. మొబైల్ ఫోన్ లేదా మెసేజ్‌లోని ఏదైనా లింక్‌పై క్లిక్ చేయవద్దు

అంతేకాదు సైబర్ దుండగులు పంపిన మెస్సేజ్ లో జాగ్రత్తగా గమనిస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు అలాంటి సందేశాలు వస్తున్నట్లయితే వాటిని జాగ్రత్తగా చదవండి. ఇది కాకుండా వినియోగదారులు సైబర్ క్రైమ్ https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేయవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories