Aadhaar Card: ఈ నెంబర్‌ని ఫోన్‌లో సేవ్‌ చేయండి.. ఆధార్‌ సమస్యలన్నిటికి పరిష్కారం..!

Save the 1947 number on the phone all Aadhaar Issues will be Resolved | Live News
x

Aadhaar Card: ఈ నెంబర్‌ని ఫోన్‌లో సేవ్‌ చేయండి.. ఆధార్‌ సమస్యలన్నిటికి పరిష్కారం..!

Highlights

Aadhaar Card: నేడు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ లేకుండా ఏ పని జరగదు...

Aadhaar Card: నేడు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్(Aadhaar Card) చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ లేకుండా ఏ పని జరగదు. ఇంటి నుంచి బ్యాంకు వరకు ఏ పనీ చేయలేరు. అన్ని పనులకు ఆధార్ నంబర్ కావాలి. కాబట్టి మీకు ఎప్పుడైనా ఆధార్‌కు సంబంధించి సమస్య ఉంటే, లేదా సమీప ఆధార్ కేంద్రాన్ని కనుగొనవలసి వస్తే మీరు ఈ పనిని నిమిషాల్లో చేయవచ్చు. UIDAI ఒక నంబర్‌ను జారీ చేసింది. ఇది ఆధార్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించగలదు. ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారమవుతుంది. యూఐడీఏఐ ట్విటర్ ద్వారా ఈ సమాచారం తెలిపింది.

ఈ నంబర్ 12 భాషల్లో పనిచేస్తుంది

ఆధార్‌కు సంబంధించిన ఏదైనా సమస్య కోసం మీరు 1947కి కాల్ చేయండి. మీ సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. ఈ నంబర్ దాదాపు 12 భాషల్లో పని చేస్తుంది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రజలు అయినా ఈ నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చు. మీరు ఈ నంబర్‌ను డయల్ చేయడం ద్వారా ఈ భాషలలో సహాయం పొందవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ భాషలలో మాట్లాడవచ్చు. Dial1947ForAadhaar మీకు నచ్చిన భాషలో కమ్యూనికేట్ చేయగలదు.

మీరు ఉచితంగా కాల్ చేయవచ్చు

ఈ నంబర్ పూర్తిగా ఉచితం. అంటే ఈ నంబర్‌కు కాల్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. దీంతో పాటు మీరు IVRS మోడ్‌లో 24 గంటల్లో ఎప్పుడైనా ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ కాల్ సెంటర్ ప్రతినిధులు ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు (సోమవారం నుంచి శనివారం వరకు) అందుబాటులో ఉంటారు. ఆదివారమైతే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories