logo
జాతీయం

నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న సంజయ్ రౌత్

Sanjay Raut Will Appear Before the ED Today
X

నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న సంజయ్ రౌత్

Highlights

Sanjay Raut: మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు

Sanjay Raut: ఇవాళ ఈడీ ఎదుట శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విచరణకు హాజరుకానున్నారు. సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ కేసులో రౌత్‌ను ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఈడీ భావిస్తోంది. ఈడీ కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరడంతో అందుకు కొంత సమయం కోరుతూ దరఖాస్తు చేశాం అని రౌత్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

Web TitleSanjay Raut will Appear Before the ED Today
Next Story