బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు... తండ్రిపై సంచలన వ్యాఖ్యలు..

బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు... తండ్రిపై సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

20 ఏళ్ల పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరు గాంచిన వీరప్పన్‌ కూతురు విద్యా రాణి తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు.

20 ఏళ్ల పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరు గాంచిన వీరప్పన్‌ కూతురు విద్యా రాణి తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా రాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సభలోనే 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు బీజేపీలో చేరారు. చేరిక అనంతరం ఆమె సభలో ప్రసంగించారు.

మలయాళ మనోరమ నివేదిక ప్రకారం, పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతూ, 'నా తండ్రి కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు, అయితే అతను ఎంచుకున్న మార్గం తప్పు అని.. ఆ విషయంలో తనకుగానీ, తన ఫ్యామిలీకిగానీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ.. ఆయన ఆ పని ఎందుకు చేశారన్నదే ఇక్కడ ప్రధానాంశం. చివరిశ్వాస వరకూ పేదల కోసమే బతికిన వ్యక్తి వీరప్పన్. ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయంటే.. నాన్న ఎలాంటివారో అర్థంచేసుకోవచ్చు. ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నేను బీజేపీలో చేరాను.. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరాను..

అంతేకాదు నేను కులం మరియు మతంతో సంబంధం లేకుండా పేదలు మరియు నిరుపేదల కోసం పనిచేయాలని అనుకుంటున్నాను.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలు ప్రజల కోసం మరియు తాను వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను.. ఇకనుంచి తమిళనాడులో బీజేపీ బలోపేతనానికి తనవంతు కృషి చేస్తాను' అని ఆమె చెప్పారు.

కాగా వీరప్పన్ పెద్ద కుమార్తె అయిన విద్యా రాణి ఇంతకుముందు కూడా వార్తల్లో నిలిచారు, ఆమె ప్రేమ వివాహానికి ఆమె తల్లి ముత్తులక్ష్మి ఒప్పుకోలేదు.. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు జోక్యం చేసుకుని ఆమె ప్రియుడిని వివాహం చేసుకోవడానికి విద్యా రాణికి అనుమతించింది. వృత్తిపరంగా న్యాయవాది అయిన విద్యా రాణి చురుకైన సామాజిక కార్యకర్తగా కూడా పేరుగడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories