Samudrayaan: దూకుడు పెంచిన ఇస్రో.. సముద్రయాన్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు ముహుర్తం ఖరారు

Samudrayaan To Explore Ocean Bed By 2025-End Says Kiren Rijiju
x

Samudrayaan: దూకుడు పెంచిన ఇస్రో.. సముద్రయాన్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు ముహుర్తం ఖరారు

Highlights

Samudrayaan: సముద్రయాన్‌ను 2025చివరికల్లా లాంచ్‌చేస్తామన్న కిరణ్‌ రిజిజు

Samudrayaan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల పరంపరను మరింత విస్తరిస్తోంది. ఖగోళ రహస్యాలను కనుక కనుగొనేందుకు పరిశోధనలు చేపట్టిన ఇస్రో...ఈసారి భూ అంతర్గతంలో సముద్రంలో ఉన్న సహజ వనరులను అక్కడి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. మరో ఏడాదిలో పూర్తిస్థాయి పరిశోధన ఉపగ్రహాన్ని సముద్ర గర్భంలోకి పంపేందుకు ఏర్పాటు చేస్తుంది.

చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 ప్రాజెక్ట్‌ను చేపట్టిన ఇస్రో.. అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్‌కి సిద్ధమవుతోంది. ఇదే జోరులో సముద్రయాన్ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టేందుకు రెడీ అవుతోంది. దీని లాంచింగ్‌కు ముహూర్తం కూడా దాదాపు ఖరారు చేసింది.

ఈ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైంది. కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ ప్రాజెక్టు విశేషాలను వివరించారు. సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ సముద్రయాన్‌ను 2025 చివరికల్లా లాంచ్ చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా...శాస్త్రవేత్తల బృందం...సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారు. సముద్రయాన్ కోసం మత్య్స 6000... అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నట్లు ఆయన సూచన ప్రాయంగా తెలిపారు.

సముద్రయాన్ ప్రాజెక్టు మిషన్ 2021లో ప్రారంభమైంది. మత్స్య 6000ను ఉపయోగించి ముగ్గురు శాస్త్రవేత్తలను హిందూ మహాసముద్రంలో 6,000 మీటర్ల లోతుకు పంపనున్నారు. సముద్ర యాన్ ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రాజెక్టులను అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాలు విజయవంతంగా చేపట్టాయి. తాజాగా భరత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టనున్న సముద్రం ప్రాజెక్టు విజయవంతం అయితే... సముద్రాల లోతుల్లో ఉన్న వనరులను సహజ పరిస్థితులను భారత్ అధ్యయనం చేసి... వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories