కరోనా ఎఫెక్ట్.. పెద్దఎత్తున స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..

కరోనా ఎఫెక్ట్.. పెద్దఎత్తున స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..
x
Highlights

విదేశాలలో చిక్కుకున్న భారతీయుల తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం సముద్ర సేతు మిషన్, వందే భారత్ మిషన్ నడుపుతోన్న సంగతి తెలిసిందే..

విదేశాలలో చిక్కుకున్న భారతీయుల తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం సముద్ర సేతు మిషన్, వందే భారత్ మిషన్ నడుపుతోన్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా మాల్దీవుల నుండి 588 మంది భారతీయులతో నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాష్వ్.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు కొచ్చి ఓడరేవుకు చేరుకుంది. ఇందులో కేరళకు చెందిన 568 మంది మహిళలు, తమిళనాడుకు చెందిన 15 మంది, తెలంగాణకు చెందిన ముగ్గురు, లక్షద్వీప్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు, ఇందులో 6 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా, 21 మంది పిల్లలు ఉన్నారు. మాల్దీవుల నుండి తిరిగి వచ్చిన భారతీయులలో ఇది మూడవ బ్యాచ్.

ఐఎన్ఎస్ జలష్వ్ మే 10 న మాలే నుండి 698 మంది భారతీయులతో కొచ్చి చేసురుకుంది. ఇందులో 595 మంది పురుషులు , 103 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 19 మంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. దీని తరువాత, మే 11 న, మాల్దీవుల నుండి 202 మంది భారతీయులతో ఐఎన్ఎస్ మాగర్ కొచ్చికి చేరుకుంది. ఇప్పటివరకు 1358 మందిని మాల్దీవుల నుండి భారతదేశానికి తీసుకువచ్చారు. మాల్దీవుల నుండి సుమారు 2000 మందిని తిరిగి తీసుకురావడానికి నేవీ ఐఎన్ఎస్ జలష్వ్ మరియు ఐఎన్ఎస్ మాగర్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించింది.

ఇదిలావుంటే చికాగో నుండి 168 మంది భారతీయులతో ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం తెల్లవారుజామున 4.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. ఫ్లైట్ AI-126 ఢిల్లీ ద్వారా ఇక్కడికి చేరుకుంది. అదే సమయంలో 183 మంది భారతీయులతో ఒమన్ నుంచి ప్రత్యేక ఒమన్ ఎయిర్ ఫ్లైట్ తిరువనంతపురానికి వెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories