రిపోర్టులో భార్య మగాడని తేలింది.. 8 ఏళ్ల కాపురం, ఒక బిడ్డ!

రిపోర్టులో భార్య మగాడని తేలింది.. 8 ఏళ్ల కాపురం, ఒక బిడ్డ!
x
Highlights

భార్య ఏంటి మగాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఎక్కడైనా భార్య స్థానంలో స్త్రీ ఉంటుంది.. భర్త స్థానంలో..

భార్య ఏంటి మగాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఎక్కడైనా భార్య స్థానంలో స్త్రీ ఉంటుంది.. భర్త స్థానంలో పురుషుడు ఉంటారు.. కానీ ఇక్కడ మాత్రం భార్యాభర్తల స్థానంలో ఇద్దరు కూడా మగాళ్లే ఉన్నారు. పైగా ఎనిమిదేళ్ల కాపురం చేశారు.. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. ఇంతకీ ఏమా కదా అంటే.. మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన సెహోర్‌లో, దంపతులు ఎనిమిది సంవత్సరాలు భార్యాభర్తలుగా కలిసి జీవించారు, అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వివాదం రేగింది. దాంతో భార్య చీరకు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడే క్రమంలో భర్తకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆగస్టు 12 న భార్య మరణించగా, భర్త ఆగస్టు 16 న మరణించారు.. భార్య శవపరీక్ష నివేదికను పోలీసులు గత వారం అందుకున్నారు. ఈ పరీక్షలో ఆమె స్త్రీ కాదు పురుషుడని ఇచ్చారు. దీంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అసలు విషయంపై ఆరా తీశారు..

చ‌నిపోయిన భార్య అటాప్సీ పూర్తి రిపోర్ట్‌ను ప‌రిశీలించ‌గా.. చ‌నిపోయింది అమ్మాయి కాద‌ని.. అబ్బాయేన‌ని డాక్ట‌ర్లు నిర్థారించారు. ఇదే విష‌య‌మై భ‌ర్త త‌ర‌పు సొంత అన్న‌య్యను విచారించారు. అతను ఇలా స్పందించాడు. 'నా త‌మ్ముడు ఎల్జ‌బీటీ ఉద్యంలో పాల్గొన్నాడు. అక్క‌డే అత‌నికి ఒక గే ప‌రిచ‌యం అయ్యాడు.. మేమిద్ద‌రం క‌లిసి బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు మాతో చెబితే. మా కుటంబానికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో ఇంట్లో నుంచి నా తమ్ముడు వెళ్ళిపోయాడు. ఆ త‌ర్వాత మాకు తెలియ‌కుండా పెళ్లి చేసుకొని దూరంగా ఉంటున్నారు.. ఎప్పుడూ మా దగ్గరికి వచ్చేవాడు కాదు' అని తెలిపాడు. అయితే 8 ఏళ్లుగా సెహూర్ లో నివ‌సిస్తున్న వారిద్ద‌రు నిజ‌మైన భార్య భ‌ర్త‌ల్లాగా ఉండేవారని.. చ‌నిపోయేంత‌వ‌ర‌కు కూడా స్వ‌లింగ సంప‌ర్కులు అన్న విషయం తెలియదని స్థానికులు పేర్కొన్నారు. 2012 లో వివాహం చేసుకున్న వీరిద్దరూ తమను తమ కుటుంబానికి, పొరుగువారికి భిన్న లింగ జంటగా చూపించి, పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories