Sajjanar: మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని సజ్జనార్ ట్వీట్

Sajjanar Says Not To Cooperate With Fraud Organizations
x

Sajjanar: మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని సజ్జనార్ ట్వీట్

Highlights

Sajjanar: క్యూనెట్ లాంటి సంస్థల యాడ్స్‌ను ప్రమోట్ చేయొద్దని గతంలోనే అభ్యర్థన

Sajjanar: సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక అభ్యర్థన చేశారు. క్యూనెట్ లాంటి సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లలో నటించొద్దని, అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. తాజాగా భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాపై వచ్చిన కథనాన్ని జోడిస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే మోసపూరిత సంస్థలకు సహకరించవద్దని గతంలోనే ఆయన అభ్యర్థించారు. కాగా సెలబ్రిటీలు QNETని ఆమోదించడం మానుకోవాలని.. దీని కారణంగా ప్రజలు భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారని సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న క్యూఐ గ్రూప్‌పై ఈడీ విచారణ జరుపుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories