Saif AliKhan: ఉద్యోగం పోయింది.. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. సైఫ్ పై దాడి కేసులో అనుమానితుడి ఆవేదన

Saif AliKhan: ఉద్యోగం పోయింది.. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. సైఫ్ పై దాడి కేసులో అనుమానితుడి ఆవేదన
x
Highlights

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మొదట అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాశ్ కనోజియా అనే డ్రైవర్ ను ఛత్తీస్ గడ్ లో అరెస్టు చేసిన సంగతి...

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మొదట అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాశ్ కనోజియా అనే డ్రైవర్ ను ఛత్తీస్ గడ్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో అతన్ని పోలీసులు వదిలిపెట్టారు. అయితే దీని తర్వాత తన జీవితం నాశనం అయ్యిందని ఆకాశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పూర్తి వివరాల ప్రకారం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ కోల్ కతా షాలిమార్ జ్నానేశ్వరి ఎక్స్ ప్రెస్ డ్రైవర్ గా పనిచేస్తున్న అకాశ్ ను చత్తీస్ గడ్ లో అరెస్టు చేసి ముంబైకి తీసుకువచ్చారు. అయితే విచారణలో అతను అసలు నిందితుడు కాదని తేలింది. దీంతో ఆకాశ్ ను విడుదల చేశారు. అయితే అనుమానితుడిగా అరెస్ట్ చేసినందుకు తన జీవితం నాశనం అయ్యిందని ఆకాశ్ వాపోయాడు. ఈ కేసు కారణంగా తన ఉద్యోగం పోయిందని..పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందని కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా నా ఫొటోలను చూపించడంతో ఈ కేసులో నేనే ప్రధాన నిందితుడిని అని చెప్పినప్పుడు మా కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ముంబై పోలీసులు ఒక్క తప్పిదంతోనే నా జీవితం నాశనం అయ్యింది. సైఫ్ భవనంలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తిని నేను కానని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదని ఆకాశ్ వాపోయాడు.

నేను కాబోయే వధువును కలిసేందుకు వెళ్తునప్పుడు నన్ను నిర్బంధించి రాయ్ పూర్ కు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు నన్ను కొట్టారు. కానీ విచారణలో అసలు నిజాలు తేలడంతో వదిలిపెట్టారు. కానీ అప్పటికే నా జీవితంలో అలజడి ప్రారంభమైంది. పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత నా ఉద్యోగం పోయింది. నా యజమాని నన్ను పనికి రావద్దని అడిగాడు. వారు నా మాట కూడా వినలేదు. అప్పుడు నా పెళ్లి క్యాన్సిల్ కూడా అయ్యిందని మా అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడు నాకేవరు న్యాయం చేస్తారు అని అడుగుతున్నాడు ఆకాశ్ .

Show Full Article
Print Article
Next Story
More Stories