పుట్టినరోజు వేడుకల్లో అపశృతి..తృటిలో తప్పిన పెను ప్రమాదం!

పుట్టినరోజు వేడుకల్లో అపశృతి..తృటిలో తప్పిన పెను ప్రమాదం!
x
Highlights

ముంబై తీరం హాహా కారాలతో దద్దరిల్లింది. 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ముంబై తీరంలో ప్రమాదంలో చిక్కుకుంది. క్షణం క్షణం నీటిలోకి జారిపోతోంది. ఇక 50 మంది...

ముంబై తీరం హాహా కారాలతో దద్దరిల్లింది. 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ముంబై తీరంలో ప్రమాదంలో చిక్కుకుంది. క్షణం క్షణం నీటిలోకి జారిపోతోంది. ఇక 50 మంది ప్రాణాలు జలసమాధి అయినట్లే అని అనుకున్నారు. కానీ అందులోని వారంతా ఏ అదృష్టం చేసుకున్నారో తెలియదు కానీ అనుకోకుండా మరో బోటు వారి చెంతరకు రావడంతో ప్రాణాలతో బతుకుజీవుడా అంటూ బయట పడ్డారు.

అప్పటివరకు అంతా సంతోషం. జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓ చిన్నపాటి బోటు మాట్లాడుకుని అందులోకి 50 మంది వరకు ఎక్కారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సముద్రం లో మైలు దూరం వరకు వెళ్లారు. అంతవరకు పుట్టినరోజు వేడుకల్లో మునిగితేలారు. హ్యాపీ బర్త్‌ డే అంటూ విషెస్ చెప్పుకున్నారు. ఫుల్ జోష్ మూడ్. సంబరాల్లో మునిగి తేలారు. ఎవ్రీ సెకన్ ఎంజాయ్ చేశారు.

కానీ అంతలోనే పరిస్థితి తిరగబడింది. అప్పటివరకు చక్కగా ప్రయాణించిన బోటు ఓ పక్కకు ఒరిగింది. నిదానంగా సముద్రపు నీటిలో మునిగిపోతోంది. అప్పుడు అందులో ఉన్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హా హా కారాలు చేశారు. తమను కాపాడాలంటూ కేకలు పెట్టారు. ఎవరైనా తమను కాపాడతారా అని అటూ ఇటూ చూశారు. అప్పుడు వారికి క్షణమొక యుగంగా గడిచింది. కానీ దేవుడు కరుణించాడో లేక వారి అరుపులు విన్నాడో తెలియదు కానీ అంతలోనే మరో బోటు మునిగిపోతున్న బోటు చెంతకు వచ్చింది. వారిని సురక్షితంగా కాపాడేందుకు ప్రయత్నించింది.

గేట్ వే ఆఫ్ ఇండియా తీరం నుంచి అష్టవినాయక్ -2 అనే పేరుతో ఉన్న మరో బోటు బయల్దేరింది. అటుగా వెళ్తుండగా మునిగిపోతున్న బోటు సమాచారాన్ని ఈ అష్టవినాయక్ -2 బోటు కేప్టెన్ హసురామ్ ఠాకూర్ కు అందజేశారు. దీంతో వారు తమ బోటును దారి మళ్లించారు. మునిగిపోతున్న బోటు దగ్గరకు చేరుకున్నారు. అంతే ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు లేచొచ్చాయి.

ప్రమాదంలో ఉన్న వారిని తమ బోటులోకి ఎక్కించుకున్నారు. అప్పటికే సముద్రం నీటిలో పడిన వారికి లైఫ్ జాకెట్స్ అందించారు. వాటిని అందుకున్న వారు.. సురక్షింతగా బోటు దగ్గరకు చేరుకున్నారు. వారందరినీ తీరం చేర్చారు. అంతమంది ప్రాణాలను రక్షించారు. ఓ భారీ ప్రమాదం ఈ దేశం చెవిన పడకుండా చేశారు. 50 మంది జలసమాధి కాకుండా చేశారు.

అయితే ప్రమాదంలో చిక్కుకున్న బోటు గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసలా బోటు సముద్రంలో ప్రయాణించేందుకు అనువైనది కాదని తేల్చారు. అందులో కనీసం లైఫ్ జాకెట్స్ కూడా లేవు. బోట్ కు రిజిస్ట్రేషన్ లేదు ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ కూడా లేవని తెలిపారు. ఇంజన్ కు కనెక్ట్ అయి ఉన్న మెయిన్ పైప్ లోకి నీరు చేరడంతో పడవ మునిగినట్లు గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories