ఎరువులకూ యుద్ధం సెగ.. ఆగిన పొటాష్‌, నత్రజని దిగుమతులు.. భారీగా పెరిగిన ధరలు...

Russia Ukraine War Effect on Fertilizers in India | Live News
x

ఎరువులకూ యుద్ధం సెగ.. ఆగిన పొటాష్‌, నత్రజని దిగుమతులు.. భారీగా పెరిగిన ధరలు... 

Highlights

Russia Ukraine War Effect: పొటాష్‌ ధర రూ. 1050 నుంచి రూ.1700లకు పెంపు

Russia Ukraine War Effect: ఉక్రెయిన్-రష్యా వార్ ఎఫెక్ట్‌ నిత్యావసర సరుకుల మీదనే కాదు. ఎరువుల ధరలపై ప్రభావం చూపిస్తోంది. మన దేశానికి పొటాష్, నత్రజని వంటి ముడిసరుకుల దిగుమతి తగ్గిపోయింది. ఈ ముడిసరకుల కోసం మన దేశం రష్యా, బెలారస్‌ దేశాల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. దీంతో భవిష్యత్‌లో ఎరువుల కొరత తీవ్రంగా ఉండనుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 4వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నందున, ఈ రెండు దేశాలతో పాటు బెలారస్‌ నుంచి కూడా ముడిపదార్థాలు మార్కెట్లోకి రావడం లేదు. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. అమ్మోనియా, నైట్రోజన్‌, నైట్రేట్స్‌, ఫాస్ఫేట్స్‌, పొటాష్‌, సల్ఫేట్‌.. ధరలు 30 శాతం అధికమయ్యాయి. దీంతో ఎరువుల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. కొంతమేర దక్షిణాఫ్రికా, కెనడా దేశాల నుంచి ముడిసరుకులు దిగుమతి అవుతున్నాయి.

దిగుమతులు తగ్గిపోవడంతో ఎరువుల రిటైల్‌ ధరలకు రెక్కలచ్చాయి. పొటాష్‌ ధర అనూహ్యంగా పెరిగింది. నిన్నమొన్నటి వరకూ బస్తా రూ. 1050 ఉండగా, ఇప్పుడు 1700 రూపాయలకు ఎగబాకింది. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు 50 నుంచి 70 శాతం వరకు పెరిగాయి. బస్తా కాంప్లెక్స్‌ ఎరువు ధర రూ.1400 నుంచి 1900 రూపాయలకు చేరుకుంది. దిగుమతి సక్రమంగా కొనసాగకుండా ఎరువుల ధరలు మరింత పెరగనున్నాయి.

నత్రజని ఎరువుల ఎగుమతుల్లో రష్యా టాప్‌లో నిలుస్తోంది. పొటాష్‌, ఫాస్ఫరస్‌ ఎరువుల ఎగుమతుల్లో ఆదేశం గతేడాది రెండో స్థానంలో ఉంది. ఎరువుల తయారీకి సహజ వాయువు అవసరం. దాదాపు ఐరోపా దేశాలన్నీ సహజ వాయువు కోసం రష్యా మీద ఆధారపడతాయి. అందుకే ప్రపంచ ఎరువుల ఎగుమతుల్లో రష్యాకు 14 శాతం వాటా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి సహజ వాయువు సరఫరా తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలపై ఎఫెక్ట్ పడింది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా ఆ భారం కొంత కాలం భరించకతప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories