భారత్ అమ్ములపొదిలో మరో అధునాతన ఆయుధం

Russia Starts Delivery of S-400 Weapons to India
x

ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Highlights

S-400 Weapons: ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రారంభం

S-400 Weapons: భారత్ అమ్ములపొదిలో మరో అధునాతన ఆయుధం చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. శత్రు యుద్ధ విమానాలు, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ సర్వనాశనం చేస్తోంది.

మొత్తం ఐదు యూనిట్లను 35వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు భారత్ 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ నేపధ్యంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్క్వాడ్రన్‌లోని ఫస్ట్ పార్ట్స్ భారత్ చేరుకోవడం ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో మొదటి యూనిట్ వెస్ట్రన్ ఫ్రంట్‌కు సమీపంలో మోహరించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories