Sputnik-V: త్వరలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మన మార్కెట్లోకి..!

Russia Sputnik V Vaccine be Available Market Very Soon
x

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, వ్యాక్సిన్ కొరతతో ఈ ప్రక్రియ కొంత మందకోడిగా సాగుతోంది.

Sputnik-V: దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, వ్యాక్సిన్ కొరతతో ఈ ప్రక్రియ కొంత మందకోడిగా సాగుతోంది. దీంతో ప్రజలకు కేంద్రం ఓ శుభవార్తను అందించింది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మన మార్కెట్‌లోకి త్వరలోనే రానుందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. వచ్చే వారమే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానికంగా ఈ వ్యాక్సిన్‌ ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ తయారు చేయనుంది. జులైలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ తెలిపారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఎఫ్‌డిఎ, డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఏ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను అయినా ఇండియాలో వాడేందుకు అనుమతి ఉందన్నారు. ఈ మేరకు 1-2 రోజుల్లో దిగుమతి లైసెన్స్ మంజూరు కానుందని ఆయన వివరించారు. కోవాగ్జిన్‌, కోవ్‌షీల్డ్ తోపాటు స్పుత్నిక్-వి టీకాలకు మాత్రమే ఇండియాలో విక్రయానికి అనుమతి ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories