కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 500 జరిమానా!

కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 500 జరిమానా!
x
Highlights

దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనల చట్టం సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. లేకపోతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.

దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనల చట్టం సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. లేకపోతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.. అంటూ కొత్త మోటార్ వెహికిల్ చట్టం తీసుకోచ్చారు. దేశంలో కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనల వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తికి వింత జరిమాన విధించారు అధికారు. అయితే ఆ వ్యక్తి మధ్యం సేవించినందుకో.. లేక రాంగ్ రూట్లో వచ్చినందుకో ఫైన్ వేయలేదు కేవలం కారులో హెల్మెంట్ లేకుండా డ్రైవ్ చేసినందకు రూ. 500 జరిమాన విధించారు.

తాజాగా తన కారుకు చలాన అందుకున్న వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎక్కడైనా గిసోంటి రూల్స్ ఉంటాయా? బైక్ పైనా హెల్మెంటే లేకుండా పోతే ఫైన్ ఎస్తారు కానీ ఇలా ఎక్కడ ఉందా అంటూ ఆశ్యర్యపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వ్యాపారి చలాన వచ్చింది. అందులో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు అంటూ రూ. 500 ఫైన్ విధించారు.ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ట్రాఫిక్ పోలీసుల అశ్రద్ద మరియు అజాగ్రత్త కారణంగానే ఈ సంఘటన జరిగింది. దినిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కారుకు హెల్మెట్ లేదంటూ చలాన పంపించడం దానికి ప్రత్యక్ష నిదర్శణంగా నెటిజన్స్ అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories