ఆహా ఏమి తెలివి.. శనక్కాయాల్లో రూ. 45 లక్షలు..

ఆహా ఏమి తెలివి.. శనక్కాయాల్లో రూ. 45 లక్షలు..
x
Highlights

బంగారం, వజ్రాలను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకరు వెంట్రుకల్లో డబ్బు దాచి.. మరొకరు కడుపులో వజ్రాల మూటను...

బంగారం, వజ్రాలను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకరు వెంట్రుకల్లో డబ్బు దాచి.. మరొకరు కడుపులో వజ్రాల మూటను దాచి దొరికిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. కానీ ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని తరలించడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అతని మేధాసంపత్తికి వహ్వా అనాల్సిందే.. ఆ వ్యక్తి వినూత్న రీతిలో ఆహార పదార్ధాల్లో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా... అధికారులకు చిక్కి సంచలనమయ్యాడు. సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) లో చోటుచేసుకుంది.

ఫిబ్రవరి 12, బుధవారం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వివిధ రకాల ఆహారపదార్ధాలను స్వాధీనం చేసుకుంది. టెర్మినల్‌-3 వద్దకు సాయంత్రం వచ్చిన మురాద్‌ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దాంతో అతడి వద్ద నాలుగైదు సౌదీ రియాల్స్, ఖతారి రియాల్స్, కువైట్ దినార్స్, ఒమానీ రియాల్స్ మరియు యూరోలతో సహా కరెన్సీ నోట్లు.. వేరుశెనగ, బిస్కెట్లు మరియు వండిన మటన్ కూర అందులో ఉన్నాయి. అధికారులు ముందుగా శనక్కాయలను తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయి.

ఇవి 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వేరుశెనగను ముందుగా ఒలిచి వాటిలో కరెన్సీ నోట్లను పెట్టి గమ్ అతికించాడు. అంతేకాదు బిస్కెట్‌ పాకెట్‌లో ప్రతి బిస్కెట్‌ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్‌ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఇవికాక వండిన మటన్ ముక్కలను కూడా విడదీశారు. మాంసంలోని "ఎముకలు" ఎక్కువ విదేశీ కరెన్సీని కలిగి ఉన్న స్థూపాకార వస్తువులుగా మారి మెరుస్తూ అందులో కరెన్సీ నోట్లు కనిపించాయి. దాంతో విస్తుపోయిన అధికారులు ఆ ఆహార పదార్ధాలను వెంటనే సీజ్ చేశారు. అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మురాద్‌ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories