IT Raids: ఐటీ సోదాల చరిత్రలోనే టాప్.. 5 రోజులుగా లెక్కింపు..

Rs 351 Crore Cash Seized From It Raids On Odisha Liquor Firm
x

IT Raids: ఐటీ సోదాల చరిత్రలోనే టాప్.. 5 రోజులుగా లెక్కింపు..

Highlights

IT Raids: 5 రోజులుగా లెక్కింపు.. కాంగ్రెస్ ఎంపీ కంపెనీలో ఐటీ దాడులు

IT Raids: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం 351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి. బౌద్ధ్‌ డిస్టిల్లరీ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు.

ఈ అంశం ధీరజ్‌ సాహూ కుటుంబ దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయి.కాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందేనని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ అవినాశ్‌ పాండే స్పష్టం చేశారు. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ సోదాలకు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories