ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న వాచ్‌లు స్వాధీనం

Rs 27 Crore Wrist Watch Seized at Delhi Airport
x

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న వాచ్‌లు స్వాధీనం

Highlights

Delhi: జాకబ్‌ అండ్‌ కో వాచ్‌ విలువ రూ.27,09,26,051

Delhi: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఖరీదైన వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రయాణీకుడి నుంచి వాచీలతోపాటు వజ్రాలు పొదిగిన ఓ బ్రాస్‌లెట్‌, ఐఫోన్‌ 14 ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.. ట్యాక్స్‌ ఎగ్గొట్టేందుకు సదరు ప్రయానీకుడు విలాసవంతమైన వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని తేలింది. స్వాధీనం చేసుకున్న వాచీల్లో ఒకటి అమెరికాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ జాకబ్‌ అండ్‌ కో తయారు చేసింది. దీనిని బంగారం, విలువైన వజ్రాలతో తయారు చేశారు. ఈ ఒక్క వాచీ విలువే 27కోట్ల 9లక్షల 26వేల 51 రూపాయలు ఉంటుంది.. వీటిలో రోలెక్స్‌, పియాజెట్ సంస్థలు తయారు చేసిన వాచీలున్నాయి. ఈ వాచీలన్నింటి విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానంగా ఉంటుందని దిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారుల అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories