ప్రియాంక నిన్నుచూసి నేను గర్వపడుతున్నాను : రాబర్ట్‌ వాద్రా

ప్రియాంక నిన్నుచూసి నేను గర్వపడుతున్నాను : రాబర్ట్‌ వాద్రా
x
Highlights

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన రిటైర్డ్ ఐపీఎస్...

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారాపురిని పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇదే అంశంపైన ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు.

ఈ ఘటన తనని కలిచివేసిందని అయన అన్నారు. ఈ సందర్భంగా అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. ''ప్రియాంక నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీ అవసరం ఉన్నవారిని వెళ్లి కలిశావు. నువ్వు చేసిన పని సరైందే అవసరం అయిన వారిని కలుసుకోవడం నేరం కాదు' అని ట్వీట్‌ చేశారు. ఇక నిన్న లక్నోలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరైన ప్రియాంక.. అనంతరం మాజీ ఐపీఎస్‌ అధికారి దారాపురి ఇంటికి వెళ్లారు. పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకోగా కారు దిగి నిరసన వ్యక్తం చేశారు ప్రియాంక...తననెందుకు అడ్డగించారంటూ పోలీసులపై ఆమె మండిపడ్డారు. కావాలంటే అరెస్టు చేసుకోవచ్చునని అన్నారు.

అనంతరం ఆమెను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు తన మేడపై చేయి వేశారని, మరొకరు నెట్టివేశారని ఆరోపించారు. అనంతరం నేను కింద పడిపోయానని ఆమె మీడియాకి వివరించారు. అయితే ఆమె చేసిన వాఖ్యలు అబద్దమని పోలీసులు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories