
రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే...
రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు చెప్పారు.
రాజస్థాన్ 11వ నెంబర్ జాతీయ రహదారిపై బికనీర్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టిందని దీంతో పెను ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Rajasthan: 10 people killed, 20-25 injured in collision between a bus and truck on National Highway 11 near Shri Dungargarh in Bikaner district pic.twitter.com/Pcfc42xdix
— ANI (@ANI) November 18, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




