యూపీలోని మీరట్‌లో లారీ బీభత్సం.. కారును ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన లారీ

Road Accident In Uttar Pradesh
x

యూపీలోని మీరట్‌లో లారీ బీభత్సం.. కారును ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన లారీ

Highlights

*లారీ దిగి పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది. లారీ దిగి పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులు ఐదుగురు ఉన్నారు. ట్రక్కు ఢిల్లీ నుంచి వస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories