Mumbai: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి

Road Accident 3 Dead And Several Injured In Multi-Car Crash At Mumbai
x

Mumbai: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి

Highlights

Mumbai: గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమం

Mumbai: ముంబై బాంద్రాలో కారు బీభత్సం సృష్టించింది. వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఇనోవా కారు అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపి ఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందగా.., మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సీలింక్‌లో టోల్ ప్లాజాకు సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. టోల్ ప్లాజా వైపు వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు... తొలుత మెర్సిడస్‌ బెంజ్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్‌ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories