Lockdown: బ్యాంకు వేళలు ఇవే.. ఏప్రిల్ 20 నుంచి ఇవి అమలులోకి

Lockdown: బ్యాంకు వేళలు ఇవే.. ఏప్రిల్ 20 నుంచి ఇవి అమలులోకి
x
Representational Image
Highlights

దేశంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఉంటాయని ప్రకటించారు. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధంచిన మార్గదర్శకాలు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ మార్గదర్శకాలల్లో బ్యాంకుల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. వీటి ప్రకారం బ్యాంకు బ్రాంచ్‌లు సాధారణ పనివేళల్లో తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. యధావిధిగా బ్యాంకులు కొనసాగనున్నాయి.

కాగా.. నగదు బదిలీ పూర్తయ్యేవరకు ఈ గైడ్ లైన్స్ వర్తిస్తాయని హోం శాఖ స్పష్టంగా తెలియజేసింది. ఏటీఎంలు, బ్యాంకు బ్రాంచ్‌లు, బ్యాంకు నిర్వహణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించేవారు... బ్యాంక్ కరస్పాండెంట్స్, ఏటీఎం నిర్వహణ... క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలకు ఎంపిక చేసిన కార్యకలాపాలు నిర్వహణకు మాత్రమే అనుమతి ఉంది. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద భౌతిక దూరం పాటించేలా స్థానిక అధికార యంత్రాంగం భద్రత కల్పించాలని హోమ్ శాఖ ఆదేశించింది.

అయితే సవరించిన ఈ మార్గదర్శకాలు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో కంటైన్‌మెంట్ జోన్లల్లో వర్తించవు. ఏదైనా కొత్త ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా గుర్తిస్తే ఆ ప్రాంతంలో సవరించిన గైడ్‌లైన్స్ మొత్తం రద్దవుతాయని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంకా ఆర్థిక రంగంలో బ్యాంకులు, ఏటీఎం లతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెబీ నోటిఫై చేసిన క్యాపిటల్, ఎన్‌పీసీఐ, సీసీఐఎల్, డెట్ మార్కెట్లు, ఐఆర్‌డీఏఐ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కార్యకలాపాలు సాగిస్తాయి. మే మూడు వరకు ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories