Top
logo

భార్యను 300 ముక్కలుగా కోసినందుకు రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ కు జీవిత ఖైదు

భార్యను 300 ముక్కలుగా కోసినందుకు రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ కు జీవిత ఖైదు
Highlights

2013 లో భువనేశ్వర్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని 300 ముక్కలుగా కోసినందుకు 78 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ వైద్యుడికి ...

2013 లో భువనేశ్వర్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని 300 ముక్కలుగా కోసినందుకు 78 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ వైద్యుడికి కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. నిందితుడు సోమనాథ్ పరిదా హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఖుర్దా జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి లోక్‌నాథ్ మోహాపాత్ర.. అతనికి జీవితఖైదు శిక్ష విధించినట్లు ప్రభుత్వ ప్లీడర్ ఆర్ఆర్ బర్మా తెలిపారు. ఐఆర్‌సి గ్రామానికి చెందిన సోమనాథ్ పరిదా తన 62 ఏళ్ల భార్య ఉషశ్రీ పరిడాను జూన్ 3, 2013 న హత్య చేశాడు. అతన్ని జూన్ 21న నాయపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇందులో ప్రత్యక్ష సాక్షులు లేనందున.. పరిదా యొక్క నేరారోపణ సందర్భోచిత ఆధారాలపై ఆధారపడింది. ఈ క్రమంలో ఏడేళ్లపాటు విచారణ సాగింది.

బాధితురాలి కుమార్తె విదేశాలలో ఉన్నారు.. రోజు తన తల్లితో ఫోనులో మాట్లాడే కూతురు.. 15 రోజులుగా తన తల్లికి ఫోన్ చేస్తూ వస్తోంది. ఆమె ఎంతకీ స్పందించలేదు.. ఈ క్రమంలో తండ్రికి ఫోన్ చేసిందామె.. తల్లితో మాట్లాడాలని పట్టుబట్టినప్పటికీ, ఆమె తండ్రి ఆమెకు ఫోన్ ఇవ్వలేదు.. దాంతో కుమార్తె.. ఆరా తీయడానికి ఐఆర్‌సి గ్రామ ప్రాంతంలోని తమ ఇంటికి బంధువును పంపింది. బంధువు, మహిళను హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దాంతో హత్య సంఘటన వెలుగులోకి వచ్చిందని ప్రభుత్వ పిటిషనర్ తెలిపారు.

అయితే పోలీసులు మృతదేహాన్ని అతికష్టంమీద కనుగొన్నారని. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని 300 ముక్కలుగా కోసి, ప్రత్యేక ఉక్కు పాత్రలలో ఉంచ్చినట్టు గుర్తించారని తెలిపారు. ఘటనా స్థలం నుంచి నుంచి పోలీసులు కత్తి, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటినుంచి ఈ కేసు సుదీర్ఘంగా విచారణ జరుగుతూ వస్తోంది.. ఈ క్రమంలో ఖుర్దా జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి లోక్‌నాథ్ అతనికి జీవిత ఖైదు విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అమెరికాలో ఉన్న ముద్దాయి కూతురు.. తండ్రిని చూసేందుకు నిరాకాయించింది.. అంతేకాకుండా అతనికి ఎటువంటి సహాయం చేయలేదని తెలుస్తోంది.

Web TitleRetired Army doctor gets life imprisonment for chopping wife into 300 pieces
Next Story


లైవ్ టీవి