Restrictions On Imports Of Foreign Goods : 101 విదేశీ వస్తువుల దిగుమతుల పై ఆంక్షలు

Restrictions On Imports Of Foreign Goods : 101 విదేశీ వస్తువుల దిగుమతుల పై ఆంక్షలు
x
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Highlights

Restrictions On Imports Of Foreign Goods : రక్షణ మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భార్ భారత్ లో భాగంగా రక్షణ ఉత్పత్తులలో స్వదేశీకరణను పెంచడానికి 101 వస్తువుల దిగుమతుల పై ఆంక్షలు విధించింది.

Restrictions On Imports Of Foreign Goods : రక్షణ మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భార్ భారత్ లో భాగంగా రక్షణ ఉత్పత్తులలో స్వదేశీకరణను పెంచడానికి 101 వస్తువుల దిగుమతుల పై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం ప్రకారం భారత రక్షణ పరిశ్రమ స్వంత డిజైన్, అభివృద్ధి సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా లేదా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి DRDO రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా గొప్ప అవకాశాన్ని అందిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారతదేశంలో రక్షణదళాలకు కావాలసిన వివిధ మందుగుండు సామగ్రిని తయారు చేయడానికి భారత పరిశ్రమ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు సామర్థ్యాలను అంచనా వేయడానికి సాయుధ దళాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలతో సహా అన్ని వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులు జరిపి తరువాత ఈ జాబితాను రక్షణశాఖ తయారు చేస్తుందన్నారు.

2020 ఏప్రిల్ 26 నుంచి ఆగస్టు మధ్య కాలంలో దాదాపు 260 పథకాలకు త్రివిధ దళాలతో సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టుతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. వచ్చే ఏడాదిలోపు దేశీయ పరిశ్రమపై దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు రక్షణశాఖ నుండి ఉంటాయని అంచనా వేసింది. వీటిలో, దాదాపు 1,30,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఆర్మీ, వైమానిక దళం కోసం , దాదాపు 1,40,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను కాలంలో నేవీ అవసరాలకోసం అంచనా వేసిందన్నారు. రక్షణశాఖ విదేశి దిగుమతులపై ఆంక్షలు 2020 నుండి 2024 మధ్య క్రమంగా అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయబడ్డాయి. సాయుధ దళాల అవసరాల గురించి భారత రక్షణ పరిశ్రమకు తెలియజేయడమే తమ లక్ష్యమని, తద్వారా వారు స్వదేశీకరణ లక్ష్యాన్ని సాకారం చేయడానికి బాగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories