Haryana: హర్యానాలో భారీ వర్షాలు.. నీట మునిగిన హోంమంత్రి నివాసం..

Residence of Haryana home minister Seen flooded amid incessant Rainfall
x

Haryana: హర్యానాలో భారీ వర్షాలు.. నీట మునిగిన హోంమంత్రి నివాసం..

Highlights

Haryana: హర్యానాలో భారీ వర్షాలు.. నీట మునిగిన హోంమంత్రి నివాసం.

Haryana: హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల కాలనీలు తటాకాల్లా మారిపోయాయి. వరదలతో వీధులు నదులను తలపిస్తున్నాయి. అంబాలా పట్టణంలో హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ నివాసం కూడా నీట మునిగింది.

ఆయన ఇంటి లోపల కూడా మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. అనిల్‌ విజ్‌ ఇల్లు మాత్రమే కాదు, ఆయన ఉండే కాలనీ కూడా పూర్తిగా జలమయమైంది. జనం ఇళ్ల నుంచి కాలు కూడా బయట పెట్టలేనంతగా వీధిలో వరద నీళ్లు నిలిచాయి. అనిల్‌ విజ్‌ నివాసం నీట మునిగిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories