RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

Reserve Bank of India Key Decision
x
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఫైల్ ఇమేజ్)
Highlights

RBI: యూజర్‌ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ కావడం కుదరదు.

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్‌ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే.. చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయ్యి ప్యాకేజీ రెన్యువల్‌ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఇక అలా కుదరదు.

అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమలు చేయనుంది. హ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్‌ఏ ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్‌ డిడక్ట్‌ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్‌లైన్‌ దొంగతనాలకు ఆస్కారం ఉండటంతో... అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. కార్డులతో పాటు UPI, PPI ద్వారా చెల్లింపులకు వర్తించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories