Republic Day Rehearsals: ఢిల్లీలో కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే రిహార్సల్స్

Republic Day Rehearsal At Kartavyapath In Delhi
x

Republic Day Rehearsals: ఢిల్లీలో కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే రిహార్సల్స్

Highlights

Republic Day Rehearsals: ఢిల్లీలో కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే రిహార్సల్స్

Republic Day Rehearsals: మరికొన్ని రోజుల్లో రిపబ్లిక్ డే వేడుకలను భారత్ ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏటా దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలను ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ వేడుకలు చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో రిహార్సల్స్ జరుగుతున్నాయి. జనవరి 26న కవాతు కోసం ఎర్రకోట వైపు వెళ్లే మార్గంలో విజయ్ చౌక్ నుంచి రిహార్సల్ ప్రారంభమైంది. ఈ సయయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇక రిపబ్లిక్ డే కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, పారామిలిటరీ బలగాల రెజిమెంట్‌లు అద్భుతమైన కవాతులు నిర్వహిస్తున్నాయి. సరికొత్త క్షిపణులు, విమానాలు, ఆయుధ వ్యవస్థలతో భారతదేశ రక్షణ శక్తిని ప్రదర్శించే విధంగా రిహార్సల్స్ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories