Republic Day: ఢిల్లీలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..ఆకట్టుకున్న తెలుగు రాష్ట్రాల శకటాలు

Republic Day: ఢిల్లీలో  వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..ఆకట్టుకున్న తెలుగు రాష్ట్రాల శకటాలు
x
Highlights

డే సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా వందన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌లో అమర...

డే సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా వందన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌లో అమర జవాన్లకు నివాళి అర్పించారు.

దేశ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జయిర్‌ బొల్సనారోతో కలిసి ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవందనాన్ని వారు స్వీకరించారు.

ఆకట్టుకున్న శకటాలు


ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఈ శకటాలలో తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ ఆకట్టుకుంది.



ఇక ముందు భాగంలో రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు, మధ్య భాగంలో సమ్మక్క, సారక్కల గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి భారీ రూపం కొలువుతీర్చిన తెలంగాణా శకటం తన ప్రత్యేకతను చాటుకుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories