ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత
x
Bejan Daruwalla (File Photo)
Highlights

ప్రఖ్యాత భారతీయ జ్యోతిష్కులు బెజన్ దారువాలా (89) మరణించారు.

ప్రఖ్యాత భారతీయ జ్యోతిష్కులు బెజన్ దారువాలా (89) మరణించారు. గతకొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈయన జ్యోతిషశాస్త్ర అంచనాలను దేశవ్యాప్తంగా లక్షలాది మంది అనుసరిస్తుంటారు. కాగా ఆయనకు కొద్ది రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని సోకిందని.. దాంతో అహ్మదాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని. అంతేకాదు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయి.

అయితే కరోనా బారిన పడి మరణించారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్‌ దారువాలా ఖండించారు. ఆయన న్యూమోనియాతో మరణించారని తెలిపారు. కెరీర్‌లో అనేక వార్తాపత్రికలు, న్యూస్‌ ఛానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories