ఠాక్రేకు గుడ్‌న్యూస్‌: ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

ఠాక్రేకు గుడ్‌న్యూస్‌: ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌
x
Uddhav Thackeray(File photo)
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు పెద్ద ఊరట లభించింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు పెద్ద ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 28 లోపు జరుపుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాసిన లేఖకు బదులిచ్చింది. దీంతో ప్రస్తుతం ఏ సభలో సభ్యుడిగా లేని ఉద్ధవ్ థాకరే కు ఎమ్మెల్సీ మార్గం సుగమం అయింది. వాస్తవానికి ఈనెల 28 కు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరునెలలు అవుతుంది..

ఈ లోపే ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది. లేదంటే ఆయన పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలో ఉన్న తొమ్మది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఠాక్రే మండలికి ఎన్నిక కానున్నారు. దాంతో సీఎం పదవిలో కొనసాగేందుకు ఠాక్రేకు మార్గం సుగమం అయినట్టయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories