ప్రయాణికులకు ఊరట: ఎకానమీ క్లాస్‌ టికెట్ ధరలకు పరిమితి అమలు – ఎయిర్ ఇండియా ప్రకటన

ప్రయాణికులకు ఊరట: ఎకానమీ క్లాస్‌ టికెట్ ధరలకు పరిమితి అమలు – ఎయిర్ ఇండియా ప్రకటన
x
Highlights

ఇండిగో విమానాల రద్దు సంక్షోభం నడుమ ప్రయాణికులకు ఊరటగా ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితిని అమలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, రిఫండ్ వివరాలు, ప్రయాణికులపై ప్రభావం—పూర్తి సమాచారం ఇక్కడ.

ఇండిగో విమానాల సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులు తీవ్ర గందరగోళంతో కుదేలైన నేపథ్యంలో, ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకానమీ క్లాస్‌ టికెట్ల ధరలపై విధించిన బేస్ ప్రైస్ లిమిట్‌ను ఈ రోజు నుంచే అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

ఎక్స్‌ (Twitter) వేదికగా ఎయిర్ ఇండియా స్పష్టీకరిస్తూ—

“డిసెంబర్ 6న పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఎకానమీ క్లాస్‌ బేస్ ధరల పరిమితి వెంటనే అమల్లోకి వస్తోంది. మా రిజర్వేషన్ సిస్టంలో కొత్త ధరలను అమలు చేశాం. కొన్ని గంటల్లో పూర్తిగా ప్రభావం చూపిస్తుంది” అని పేర్కొంది.

అదే విధంగా థర్డ్–పార్టీ బుకింగ్ ప్లాట్‌ఫార్ములు సజావుగా పని చేయడానికి దశలవారీగా ధర పరిమితి అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మార్పులు అమలవుతున్న సమయంలో ఎవరైనా నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ ధరకు ఎకానమీ టికెట్ బుక్ చేస్తే, ఆ అదనపు మొత్తం మొత్తాన్ని రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఇండిగో సంక్షోభం కారణంగా ఏర్పడిన అరాచకం

డీజీసీఏ (DGCA) జారీ చేసిన ఎఫ్‌డీటీఎల్‌ నియమాలను ఇండిగో పాటించకపోవడంతో వందల విమానాలు రద్దయ్యాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరల నియంత్రణ ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories