Reliance Industries: భారీ స్థాయి సంపద సృష్టిలో రిలయన్స్‌ టాప్‌

Reliance Industries Tops The Motilal Oswal Report
x

Reliance Industries: భారీ స్థాయి సంపద సృష్టిలో రిలయన్స్‌ టాప్‌

Highlights

Reliance Industries: తర్వాతి స్థానాల్లో నిలిచిన టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్

Reliance Industries: అయిదేళ్ల వ్యవధిలో భారీ స్థాయిలో సంపదను సృష్టించిన కంపెనీల్లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా అయిదోసారీ అగ్రస్థానంలో నిలిచింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత 17 సార్లు నిర్వహించిన అయిదేళ్ల నివేదికలో 10 సార్లు రిలయన్స్‌ నంబర్‌ 1 స్థానాన్ని దక్కించుకుంది.

2018 నుంచి 2023లో ఇప్పటిదాకా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 9లక్షలా 63వేల 800 కోట్లను సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో టీసీఎస్ 6.77 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 4.15 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ ‌3.61 లక్షల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ ‌2.8 లక్షల కోట్ల సంపదను సృష్టించాయి. ఇక అత్యంత వేగంగా గత అయిదేళ్లలో షేరు ధరను పెంచుకున్న కంపెనీల్లో లాయిడ్స్‌ మెటల్‌ నిలిచింది. ఈ సంస్థ షేరు 79 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. దీని తర్వాతి స్థానాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, లిండే ఇండియా, అదానీ పవర్ ‌ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories