ఢిల్లీ సీఎం రేఖ చేతిలో 10 శాఖలు... ఢిల్లీ కేబినెట్‌లో ఎవరెవరికి ఏమిచ్చారంటే..

Pavan Reddy
Updated on: 20 Feb 2025 10:17 PM IST
Rekha Gupta first cabinet meeting over Parvesh Verma gets Irrigation, Ashish Sood is Delhi new home minister
X

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతిలో 10 శాఖలు... ఢిల్లీ కేబినెట్‌లో ఎవరెవరికి ఏమిచ్చారంటే.. 

Who got what in Delhi Cabinet: ఢిల్లీలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ కొత్త కేబినెట్ భేటీ అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్ లో సీఎం రేఖా గుప్తా కాకుండా మరో ఆరుగురు మంత్రులు ఉన్నారు. వీరికి సీఎం రేఖ వివిధ శాఖలు కేటాయించారు. సీఎం పదవి కోసం పోటీపడిన పర్వేశ్ వర్మకు నీటిపారుదల శాఖను కేటాయించారు. బీజేపి హామీ ఇచ్చిన యమునా నది శుద్ధి కార్యక్రమం ఈ నీటి పారుదల శాఖ కిందకే వస్తుంది. అలా పర్వేశ్ వర్మకు ఒకరకంగా పెద్ద బాధ్యతే ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ హోంశాఖ బాధ్యతలు రేఖా గుప్తా కానీ లేదా పర్వేశ్ వర్మ కానీ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా హోంశాఖ బాధ్యతలను ఆశీష్ సూద్‌కు అప్పగించారు. ఆయనకు మొత్తం ఏడు శాఖలు అప్పగించారు.

రేఖా గుప్తా:

సీఎం రేఖా గుప్తా చేతిలో మొత్తం 10 శాఖలు ఉన్నాయి. ఆర్థిక శాఖ, రెవిన్యూ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సాధారణ పరిపాలన విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, పౌర సమాచారం సంబంధాలు, విజిలెన్స్ శాఖలు ఆమె వద్దే ఉన్నాయి. ఇవేకాకుండా ప్రస్తుతం ఎవ్వరికీ కేటాయించని ఇతర శాఖలు కూడా సీఎం వద్దే ఉన్నాయి.

పర్వేశ్ వర్మ:

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, శాసనసభ వ్యవహరాలు, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, తాగు నీరు, గురుద్వార ఎన్నికలు

ఆశిష్ సూద్ :

హోమ్, విద్యుత్, పట్టణాభివృద్ధి శాఖ, విద్య, ఉన్నత విద్యాశాఖ, ట్రైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్

మంజిందర్ సింగ్ సిర్సా:

ఫుడ్ అండ్ సప్లైస్, అటవీ పర్యావరణం, పరిశ్రమలు

రవీందర్ సింగ్:

సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, సహకార ఎన్నికలు

కపిల్ మిశ్రా:

న్యాయ శాఖ, కార్మిక శాఖ, ఉపాధి శాఖ, అభివృద్ధి, కళలు, సంస్కృతి, భాషా శాఖ, పర్యాటక శాఖ

పంకజ్ కుమార్ సింగ్:

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రవాణ శాఖ, సమాచార సాంకేతిక శాఖ.

Also watch this video: Rekha Gupta: దిల్లీ పీఠాన్ని 27 ఏళ్ళ తరువాత బీజేపీ ఎలా దక్కించుకుంది?

Pavan Reddy

Pavan Reddy

Next Story