IPL Prize Money: 18 ఏళ్ల కల నెరవేర్చిన RCB టైటిల్‌ మరియు భారీ ప్రైజ్ మనీ

IPL Prize Money: 18 ఏళ్ల కల నెరవేర్చిన  RCB టైటిల్‌ మరియు భారీ ప్రైజ్ మనీ
x

IPL Prize Money: 18 ఏళ్ల కల నెరవేర్చిన RCB  టైటిల్‌ మరియు భారీ ప్రైజ్ మనీ

Highlights

RCB ఐపీఎల్ 2025 టైటిల్‌ను తొలిసారి గెలుచుకుంది. విజేతగా నిలిచిన ఆర్సీబీ రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకుంది. రన్నరప్‌ పంజాబ్ కింగ్స్, ఇతర టాప్ 4 జట్ల ప్రైజ్ మనీ, వ్యక్తిగత అవార్డులు వివరాలు తెలుసుకోండి.

IPL Prize Money: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు తన 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాటు రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతిని కూడా అందుకుంది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ హై టెన్షన్ మ్యాచ్‌లో రజత్ పాటీదార్ నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అద్భుతంగా ఆడింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అసలు మ్యాజిక్‌ను కృనాల్ పాండ్యా చేశాడు. అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పుతూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.

ప్రైజ్ మనీ వివరాలు:

విన్నర్ (RCB): ₹20 కోట్లు

రన్నరప్ (PBKS): ₹12.5 కోట్లు

మూడో స్థానం (MI): ₹7 కోట్లు

నాలుగో స్థానం (GT): ₹6.5 కోట్లు

వ్యక్తిగత అవార్డులు:

ఆరెంజ్ క్యాప్ – సాయి సుదర్శన్ (₹10 లక్షలు)

పర్పుల్ క్యాప్ – ప్రసిద్ధ్ కృష్ణ (₹10 లక్షలు)

ఎమర్జింగ్ ప్లేయర్ – సాయి సుదర్శన్ (₹10 లక్షలు)

వాల్యూబుల్ ప్లేయర్ – సూర్యకుమార్ యాదవ్ (₹15 లక్షలు)

సూపర్ స్ట్రైకర్ – వైభవ్ సూర్యవంశీ (₹10 లక్షలు + SUV)

ఫాంటసీ కింగ్ – సాయి సుదర్శన్ (₹10 లక్షలు)

బెస్ట్ క్యాచ్ – కమిందు మెండిస్ (₹10 లక్షలు)

మోస్ట్ డాట్ బాల్స్ – మహ్మద్ సిరాజ్ (₹10 లక్షలు)

మోస్ట్ సిక్సెస్ – నికోలస్ పూరన్ (₹10 లక్షలు)

మోస్ట్ ఫోర్స్ – సాయి సుదర్శన్ (₹10 లక్షలు)

ఫెయిర్‌ప్లే అవార్డు – చెన్నై సూపర్ కింగ్స్ (₹10 లక్షలు)

బెస్ట్ పిచ్ & గ్రౌండ్ – ఢిల్లీ (₹50 లక్షలు)


ఫైనల్ మ్యాచ్ అవార్డులు:

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – కృనాల్ పాండ్యా (₹5 లక్షలు)

సూపర్ స్ట్రైకర్ – జితేష్ శర్మ (₹1 లక్ష)

మోస్ట్ డాట్ బాల్స్ – కృనాల్ పాండ్యా (₹1 లక్ష)

మోస్ట్ ఫోర్స్ – ప్రియాంశ్ ఆర్య (₹1 లక్ష)

ఫాంటసీ కింగ్ – శశాంక్ సింగ్ (₹1 లక్ష)

మోస్ట్ సిక్సెస్ – శశాంక్ సింగ్ (₹1 లక్ష)


ఎమోషనల్ విజయం:

ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానులకు ఇది భావోద్వేగ క్షణంగా నిలిచింది. విరాట్ కోహ్లీ మ్యాచ్అంతా తన ఎమోషన్స్‌తో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన వ్యాఖ్య, "ఈ టైటిల్‌ను మా అభిమానులకు అంకితంగా ఇస్తున్నాం," అని చెప్పడంతో అందరి గుండెల్లో ఊపు వచ్చింది.

2025 ఐపీఎల్ RCB చరిత్రలోనే కాక, లీగ్ చరిత్రలోనూ గుర్తుండిపోయే మైలురాయిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories