Ranveer Allahbadia Row: రణ్‌వీర్ అలహాబాదియాకు సుప్రీం కోర్టు లాయర్ ఎవరో తెలుసా?

ranveer allahbadias advocate in supreme court is ex cji DY Chandrachuds son abhinav chandrachud
x

Ranveer Allahbadia Row: రణ్‌వీర్ అలహాబాదియాకు సుప్రీం కోర్టు లాయర్ ఎవరో తెలుసా?

Highlights

Ranveer Allahbadia Row: రణ్‌వీర్ అలహాబాదియాకు సుప్రీం కోర్టు లాయర్ ఎవరో తెలుసా? ఆయన నెలకు ఎంత సంపాదిస్తారు? మొత్తం నెట్‌వర్త్ ఎంతంటే...

Ranveer Allahbadia controversy latest news updates: రణ్‌వీర్ అలహబాదియా ఇండియాస్ గాట్ లాటెంట్ అనే షోలో చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. రణ్‌వీర్ వ్యాఖ్యలపై దేశం నలుమూలల కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ కేసులను అన్నింటిని ఒక్కచోట క్లబ్ చేసి విచారణ చేయాల్సిందిగా కోరుతూ రణ్‌వీర్ అలహబాదియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

రణ్‌వీర్ అలహబాదియా తరపున సుప్రీం కోర్టులో వాదించేందుకు వచ్చిన లాయర్ మరెవరో కాదు.. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్. రణ్‌వీర్ అలహబాదియాపై నమోదైన కేసు విషయంలో విచారణకు రావాల్సిందిగా అస్సాం పోలీసులు నోటీసులు జారీచేశారు. శుక్రవారమే అస్సాం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ రణ్‌వీర్ అక్కడికి వెళ్లకుండా సుప్రీం కోర్టుకు వెళ్లారు.

ఇదే విషయమై అభినవ్ చంద్రచూద్ సుప్రీం కోర్టులో మాట్లాడుతూ అదే రోజున రణ్‌వీర్ అలహబాదియా పిటిషన్‌ను అర్జెంట్‌గా కోర్టు విచారణ జాబితాలో చేర్చాల్సిందిగా కోర్టును కోరారు.

అదే రోజు పిటిషన్ విచారణకు లిస్ట్ చేయాల్సిందిగా అభినవ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరస్కరించారు. మౌఖికంగా చెప్పడాన్ని కోర్టులు అనుమతించవు అని చీఫ్ జస్టిస్ బదులిచ్చారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, మరో జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. పిటిషన్ విచారణకు లిస్ట్ చేయడానికి కనీసం మరో రెండు, మూడు రోజులు సమయం పడుతుందని ధర్మాసనం బదులిచ్చింది.

రణ్‌వీర్ అలహబాదియా రిట్ పిటిషన్ విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదని సుప్రీం కోర్టు వెబ్‌సైట్ డేటా చెబుతోంది.

అర్నాబ్ గోస్వామి కేసులో జడ్జిమెంట్‌ను ఉదాహరణగా సూచించిన రణ్‌వీర్ అలహబాదియా

తనపై దేశం నలుమూలల నమోదవుతున్న కేసుల విచారణను ముంబై పరిధిలోకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రణ్‌వీర్ అలహబాదియా సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన అందుకు ఉదాహరణగా గతంలో జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును సూచించారు. 2020 ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర పాల్‌గఢ్ జిల్లాలో సాధువుల హత్యలపై గోస్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

గోస్వామి వ్యాఖ్యలపై మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఫిర్యాదుదారుల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. దాంతో ఈ అన్ని కేసుల విచారణను ముంబై పరిధిలోకి తీసుకొస్తూ అప్పట్లో కోర్టు తీర్పు చెప్పడాన్ని ఇప్పుడు రణ్‌వీర్ అలహబాదియా తన పిటిషన్‌లో ప్రస్తావించారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పిటిషనర్లు తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటారు అనేదానికి రణ్‌వీర్ అలహబాదియా పిటిషన్ మరో ఉదాహరణగా నిలిచింది. గతంలోనూ అనేక వివాదాల్లో ఇలాంటి పిటిషన్స్ దాఖలైన సందర్భాలున్నాయి.

Beerbiceps Ranveer Allahbadia : రణ్‌వీర్ అలహబాదియా యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా?

Show Full Article
Print Article
Next Story
More Stories