Top
logo

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు
X
Highlights

సోమవారం సాయంత్రం ఇషా నమాజ్‌ అనంతరం ఆకాశాన నెలవంక కనిపించడంతో రంజాన్‌ ప్రారంభమైందని ముస్లిం మతపెద్దలు...

సోమవారం సాయంత్రం ఇషా నమాజ్‌ అనంతరం ఆకాశాన నెలవంక కనిపించడంతో రంజాన్‌ ప్రారంభమైందని ముస్లిం మతపెద్దలు మసీదుల్లో సైరన్లు మోగించారు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం ' రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు.

ప్రతి రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. వేకువ జామున 4 గంటలకు అల్పాహారాన్ని తీసుకుంటారు. దీన్నే సహారీ అంటారు. తెల్లవారిన దగ్గర్నుంచి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా దీక్షను పాటించి తరువాత దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. నేటినుంచి రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం ప్రజలు ఉపవాసదీక్షలను జరుపుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఎంతో శుభప్రదమయిన ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరిచి, నరకద్వారాలు మూసివేసి ఉంటాయని విశ్వసిస్తారు.

Next Story