రామసేతుకు జాతీయ స్మారక హోదా కల్పించాలంటూ పిటిషన్

Ram Setu As National Heritage Subramaniam Swamy Has Filed Pil In Supreme Court
x

రామసేతుకు జాతీయ స్మారక హోదా కల్పించాలంటూ పిటిషన్

Highlights

*ఫిబ్రవరి మొదటి వారం వరకు సమయం కోరిన కేంద్రం

Ram Setu: రామసేతుకు జాతీయ స్మారక హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై స్పందించేందుకు ఫిబ్రవరి మొదటి వారం వరకు సమయం కావాలని సుప్రీంను కేంద్రం కోరింది. డిసెంబర్ 12 నాటికి కౌంటర్ దాఖలు చేస్తామన్న ఎస్జీ తుషార్ మెహతా.. ఇప్పటి వరకు దాఖలు చేయలేదని సుబ్రహ్మణ్యస్వామి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పటికే సిద్ధమైందని సొలిసిటర్ జనరల్ చెప్పారని.. ఇప్పుడు అది ప్రిపరేషన్‌లో ఉందంటున్నారన్నారు. ఇది కేబినెట్ వ్యవహారం అని తెలిపిన సుబ్రహ్మణ్యస్వామి.. సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2023 ఫిబ్రవరి7 కంటే ముందు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories