రాఖీ పండుగకు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు: పాక్ ముస్లిం సోదరి ఖమర్ షేక్ హృదయస్పర్శక కధ

రాఖీ పండుగకు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు: పాక్ ముస్లిం సోదరి ఖమర్ షేక్ హృదయస్పర్శక కధ
x

రాఖీ పండుగకు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు: పాక్ ముస్లిం సోదరి ఖమర్ షేక్ హృదయస్పర్శక కధ

Highlights

రాఖీ పండుగకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, అన్నా-చెల్లెళ్ల మధ్య బంధానికి గుర్తుగా రక్షా బంధన్‌ వేడుకలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరగనున్నాయి.

రాఖీ పండుగకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, అన్నా-చెల్లెళ్ల మధ్య బంధానికి గుర్తుగా రక్షా బంధన్‌ వేడుకలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లానే, ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కడతానంటూ తన ప్రేమను మరోసారి చాటుకుంది పాకిస్తాన్‌ మూలాలున్న ముస్లిం మహిళ ఖమర్ మొహ్సిన్ షేక్.

కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఆమె స్వయంగా తన చేతులతో నాలుగు ప్రత్యేక రాఖీలు తయారు చేశారు. వాటిపై ‘ఓం’ మరియు ‘గణేశ్ జీ’ డిజైన్లు ఉన్నాయి. ప్రధాని కార్యాలయం (PMO) నుంచి ఆహ్వానం కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

“సోదరి ఎలా ఉన్నారు?” అన్న ఆ ఒక మాటే బంధానికి ఆద్యం

ఖమర్ షేక్ మాట్లాడుతూ, "నరేంద్ర మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. ఒకసారి ఆయన నా గురించి ఆరా తీసి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని అడిగారు. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం ఆయన కోసం రాఖీ తయారు చేస్తుంటాను" అని చెప్పారు.

అంతేకాకుండా, గతంలో మోదీ గుజరాత్ సీఎం కావాలని తన ప్రార్థన నెరవేరిందని, ఆ తర్వాత ప్రధాని అయ్యేలా ఆకాంక్షించానని, అది కూడా నెరవేరిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

గత సంవత్సరం రాలేకపోయినా.. ఈసారి ఆశాభావం

గత ఏడాది ఢిల్లీకి వెళ్లలేకపోయానని చెప్పారు ఖమర్. కానీ ఈసారి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. రాఖీ కట్టి, మోదీకి తన ప్రేమను వ్యక్తం చేయాలని ఆమె కోరుకుంటున్నారు.

ఈ కథ సింపుల్‌గానే అనిపించవచ్చు కానీ, అది మత, దేశాల గడులను దాటి ఉన్న మనసుల బంధానికి నిదర్శనం. ఖమర్ షేక్ చూపించిన ప్రేమ, భక్తి, మరియు ఎటువంటి ప్రతిఫల ఆశ లేకుండా మోదీతో చెల్లెలిగా ఏర్పరచుకున్న అనుబంధం ఎంతో స్పెషల్.

రక్షాబంధన్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు… అది హృదయాలను కలిపే పవిత్ర బంధం.

Show Full Article
Print Article
Next Story
More Stories