పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
x
Highlights

కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందింది .

కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పౌరసత్వ (సవరణ) బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందింది . ఈ బిల్లుకు 125 మంది ఎంపీ అనుకూలంగా ఓట్లు వేయగా, 105మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఎగువ సభ దిగువ సభలు బిల్లుకు ఆమోదం తెలుపడంతో, పౌరసత్వ (సవరణ) బిల్లు రూపుదాల్చనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు అమల్లోకి రానుంది.

అంతకుముందు బిల్లును సెలెక్ట్‌ కమిటీ పంపించే అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌ జరిగింది. సెలెక్ట్‌ కమిటీకి పంపాలని99 మంది సభ్యులు మద్దతు తెలపగా, సెలెక్ట్‌ కమిటీ వద్దని 124 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన పార్టీ రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు పాల్గొనలేదు. అనూహ్యంగా శివసేన సభ్యులు సభలో నుంచి వాకౌట్‌ చేశారు.

పాకిస్తాన్,బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వాన్ని కల్పించడాన్ని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వలసొచ్చినవారికి పౌరసత్వాన్ని కల్పించడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించే చర్యగా వారు పరిగణిస్తున్నారు.

అయితే పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం,మణిపూర్,త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 5వేల పారామిలటరీ దళాలను కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది. కశ్మీర్ నుంచి 20 కంపెనీల మిలటరీ దళాలను ఉపసంహరించి ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించారు.ఇందులో సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎస్ఎస్‌బీ భద్రతా దళాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories