నావి అమ్ములపొదిలోకి మరో అస్త్రం..ఐఎన్‌ఎస్ ఖండేరి జల ప్రవేశం..పాకిస్థాన్‌కు..

నావి అమ్ములపొదిలోకి మరో అస్త్రం..ఐఎన్‌ఎస్ ఖండేరి జల ప్రవేశం..పాకిస్థాన్‌కు..
x
Highlights

నావి అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. కేంద్ర ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ ఖండేరిని జ‌ల‌ప్రవేశం చేశారు. దీంతో భార‌త నౌకాద‌ళం...

నావి అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. కేంద్ర ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జ‌లాంత‌ర్గామి ఐఎన్ఎస్ ఖండేరిని జ‌ల‌ప్రవేశం చేశారు. దీంతో భార‌త నౌకాద‌ళం శ‌క్తివంత‌మైంది. ముంబై నౌకాశ్రయంలో ఈ వేడుక జ‌రిగింది. రేడార్లకు చిక్కక‌పోవ‌డం దీని గొప్పత‌నం. శ‌త్రువులు వ‌దిలే టార్పిడోల‌ను ఇది ధ్వంసం చేయ‌గ‌లదు. సెకండ్ క‌ల్వరి క్లాస్‌కు చెందిన‌దే ఖండేరి జ‌లాంత‌ర్గామి. భ‌యాన‌క స్వార్డ్ టూత్ ఫిష్ అనే చేప పేరుమీద ఖండేరి పేరును పెట్టారు.

స‌ముద్రం గ‌ర్భంలోకి వెళ్లిన‌ప్పుడు స్వార్డ్ ఫిష్‌.. ఈత‌గాళ్లను అత్యంత క్రూరంగా వెంటాడుతుంది. యుద్ధ నౌక ఖండేరికి అందుకే ఆ పేరు పెట్టిన‌ట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. నౌకా సామ‌ర్ధ్యాన్ని త‌మ ప్రభుత్వం బ‌లోపేతం చేస్తుంద‌ని, ఖండేరి లాంటి జ‌లాంత‌ర్గాముల‌తో పాకిస్థాన్‌కు గ‌ట్టి స‌మాధానం ఇవ్వగ‌ల‌మ‌ని అన్నారు. జ‌మ్మూక‌శ్మీర్ అంశంలో త‌మ ప్రభుత్వ ప్రగ‌తిశీల ధోర‌ణిలో వెళ్తోంద‌న్నారు. అందుకే త‌మకు ప్రపంచ దేశాల మ‌ద్దతు ల‌భిస్తోంద‌న్నారు. కానీ పాక్ మాత్రం ర‌చ్చ చేస్తోంద‌ని మంత్రి ఆరోపించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories