ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : రజినీ కీలక నిర్ణయం

rajinikanth
x
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు శుభవార్త అందించారు. రాజకీయ రంగసప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు...

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు శుభవార్త అందించారు. రాజకీయ రంగసప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని 'రజనీ మక్కల్‌ మన్రం(ఆర్‌ఎంఎం)' శ్రేణులకు పిలుపునిచ్చారు. రజినీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి ముందు 'రజినీ మక్కల్‌ మన్రం(ఆర్‌ఎంఎం)' అనే సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలో రజినీ మక్కల్ మండ్రాం జిల్లా కార్యదర్శులను గురువారం కలిశారు. ఈ సందర్బంగా వారితో విడివిడిగాను, గ్రూపుగాను సమావేశమయ్యారు.

ఇందులో తాను తప్పకుండా తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రజనీకాంత్ వారికీ పిలుపునిచ్చారు. అంతేకాదు కమల్‌తో కలిసి వెళ్తే లాభమా.. నష్టమా? ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అనే విషయంపై కూడా చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన రజిని.. 'చాలా విషయాలు చర్చించుకున్నామని.. వాళ్లంతా సంతృప్తి చెందారని.. నాకే ఒక విషయంలో మోసపోయానన్న భావన ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తా' అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి, అందువల్ల రజనీకాంత్ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే గత కొన్నేళ్ళుగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఆయన గత సాధారణ ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు.. అంతేకాదు మోదికి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అయితే రజిని మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. దాంతో తమిళనాడులోని ఇతర పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.. రజిని ఎక్కడ బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారో అని ఆయా పార్టీలు టెన్షన్ పడ్డాయి. ఇక ఎన్నికలు ముగిసిన తొమ్మిది నెలల తరువాత రజినీకాంత్ ఆర్‌ఎంఎం కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడంతో మరోసారి తమిళనాడులో రజిని రాజకీయ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏమి జరుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories