గేమ్ స్టార్ట్ అయినట్టేనా?

గేమ్ స్టార్ట్ అయినట్టేనా?
x
Highlights

గేమ్ స్టార్ట్ అయినట్టేనా? గేమ్ స్టార్ట్ అయినట్టేనా? గేమ్ స్టార్ట్ అయినట్టేనా?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో నటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారన్న వార్త తమిళనాడులో వైరల్ గా మారింది. తలైవా (రజనీకాంత్‌) రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించిన రజిని ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. దాంతో ఆయన అభిమానులు నిరాశతో ఉన్నారు. మొన్న సాధారణ ఎన్నికల ముందు ఆయన మోదీని కలవడంతో రజిని బీజేపీలో చేరతారని అందరూ భావించారు.. కానీ అదీ జరగలేదు. అయితే తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యారన్న వార్త రజిని అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. ప్రశాంత్ తో రజిని పార్టీ ఏర్పాటుపై మాట్లాడారని, ప్రశాంత్‌ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్త పుట్టుకొచ్చింది.

అయితే ఈవార్తపై అటు ప్రశాంత్ కిషోర్ గాని, ఇటు రజినీకాంత్ గాని అభ్యంతరం తెలపకపోవడంతో వీరి భేటీ జరిగిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. మరోవైపు తమిళనాడులో నటుడు, మక్కళ్‌ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహసన్‌ ప్రశాంత్‌కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు.తాజాగా రజినీతో ప్రశాంత్ భేటీ నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులో కమల్, రజినిని ఏకం చేసి ఒకటిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో వుండేట్టు ప్రశాంత్ కిషోర్ చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో పొలిటికల్ గేమ్ మొదలయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా 2014లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదికి, రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహించారు. ఆ ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, తమిళనాడులో కమల్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories